నా వ్యాఖ్యలను జనాలు మరోలా అర్థం చేసుకున్నారు: కమల్ హాసన్

  • కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు-2
  • జులై 12న రిలీజ్
  • ప్రమోషన్స్ లో కమల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 తనకు బాగా నచ్చిందన్న కమల్
  • భారతీయుడు-2 బాగాలేదేమో అని చర్చించుకుంటున్న నెటిజన్లు
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం భారతీయుడు-2. ఈ భారీ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంకో 6 నెలల్లో భారతీయుడు-3 కూడా విడుదలకు సిద్ధం కానుంది. అయితే కమల్ భారతీయుడు-2 సినిమా ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు కాస్తంత నెగెటివ్ రీతిలో చర్చనీయాంశం అయ్యాయి. 

ఇంతకీ కమల్ ఏమన్నారంటే... భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 నాకు బాగా ఇష్టం అని అన్నారు. దాంతో నెటిజన్లు... భారతీయుడు-2 ఏమంత బాగా రాలేదమో అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో, కమల్ హాసన్ వివరణ ఇవ్వక తప్పిందికాదు. తన కెరీర్ లో భారతీయుడు-2 కోసం అధిక సమయం కేటాయించడంతో పాటు, తీవ్రంగా శ్రమించానని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అన్నారు. 

కానీ భారతీయుడు-2 గురించి తాను చేసిన వ్యాఖ్యలను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. రెండో భాగం కంటే మూడో భాగం నచ్చిందంటే... రెండో భాగం బాగాలేదని కాదని అన్నారు. సాంబారు, రసంతో అన్నం ఎంతో ఇష్టంగా తింటాం... పాయసం కూడా ఉంటే ఇంకా ఇష్టంగా తింటాం... ఆ ఉద్దేశంతోనే నేను భారతీయుడు-3 బాగుంటుందని వ్యాఖ్యానించాను అని కమల్ స్పష్టం చేశారు.

Kamal Haasan
Bharateeyudu 2
Shankar
Lyca Production

More Telugu News